ఈనెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్ కార్యక్రమాన్ని పేరెంట్స్ కమిటీ వారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షులు బొద్దపు బంగార్రాజు గారు తెలియజేశారు
విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (PTM) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి తల్లిదండ్రి, పేరెంట్స్ కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు. పిల్లల చదువు, హాజరు, అభ్యాస పురోగతిపై ఉపాధ్యాయులతో చర్చించి అవసరమైన సూచనలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేయవచ్చన్నారు. ప్రతి పేరెంట్స్ కమిటీ సభ్యుడు తన పరిధిలోని తల్లిదండ్రులను స్వయంగా ఆహ్వానించి కార్యక్రమానికి హాజరయ్యేలా చొరవ చూపాలని, “పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల–తల్లిదండ్రులు కలిసి ముందుకు సాగుదాం” అని పిలుపునిచ్చారు.

మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
ఈనెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్ కార్యక్రమాన్ని పేరెంట్స్ కమిటీ వారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షులు బొద్దపు బంగార్రాజు గారు తెలియజేశారు విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (PTM) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి తల్లిదండ్రి, పేరెంట్స్ కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు. పిల్లల చదువు, హాజరు, అభ్యాస పురోగతిపై ఉపాధ్యాయులతో చర్చించి అవసరమైన సూచనలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేయవచ్చన్నారు. ప్రతి పేరెంట్స్ కమిటీ సభ్యుడు తన పరిధిలోని తల్లిదండ్రులను స్వయంగా ఆహ్వానించి కార్యక్రమానికి హాజరయ్యేలా చొరవ చూపాలని, “పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల–తల్లిదండ్రులు కలిసి ముందుకు సాగుదాం” అని పిలుపునిచ్చారు.

