ఉదయగిరి గ్రేడ్–1 గ్రంథాలయాన్ని ఆధునికీకరించే దిశగా చర్యలు వేగవంతమవుతున్నాయి. గ్రంథాలయాన్ని నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతి కుమారి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో రెండు మోడల్ గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం సూచించిందని, ఆ జాబితాలో ఉదయగిరి గ్రంథాలయం కూడా ఉందని తెలిపారు. విద్యార్థులు, యువతకు అవసరమైన ఆధునిక వసతులతో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

ఆధునిక హంగులతో ఉదయగిరి గ్రేడ్–1 గ్రంథాలయం.. మోడల్ లైబ్రరీగా తీర్చిదిద్దేందుకు చర్యలు