Thursday, 16 July 2026
  • Home  
  • ప్రభుత్వ ఉపాధ్యాయులు మురళికి నివాళులర్పించిన శ్రీవాణి రెడ్డి
- తిరుపతి

ప్రభుత్వ ఉపాధ్యాయులు మురళికి నివాళులర్పించిన శ్రీవాణి రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 16, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మురళి కర్మక్రియల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపి గౌడ్ సోదరుడైన మురళి అకాల మరణం పట్ల ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మురళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన శ్రీవాణి రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కలిగి ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి, శ్రీరాములు గౌడ్, వెంకటేశ్వర్లు నాయుడు, మోహన్, అంకయ్య, పసల కృష్ణయ్య, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొని మురళి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.