శ్రీ కాళహస్తి, జులై 16, (పున్నమి న్యూస్): జనసేన పార్టీకి అంకితభావంతో సేవలందిస్తున్న క్రియాశీల జనసైనికుడు గుండూరు రాజు మాతృమూర్తి గుండూరు మునెమ్మ అనారోగ్యంతో పరమపదించడం పట్ల శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు దండి నరేంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట మండలం పద్మ నగర్ గ్రామానికి వెళ్లిన దండి నరేంద్ర, మునెమ్మ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి అశ్రునివాళులర్పించారు. గుండూరు రాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మునెమ్మ పవిత్ర ఆత్మకు సద్గతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని రాజు, మణి, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రసాదించాలని కోరారు. ఈ క్లిష్ట సమయంలో గుండూరు కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు దండి రాఘవయ్య, రేణిగుంట మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు, టౌన్ అధ్యక్షురాలు ఆకుల భాగ్యమ్మ, ఐటీ కోఆర్డినేటర్ దీనదయాళ్, మాజీ వార్డు సభ్యుడు భాషా, బొక్కిసం వెంకటరామయ్య, లోకేష్, మునికృష్ణ, వెంకీ, కార్తీక్ తదితర రేణిగుంట మండల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని మునెమ్మకు ఘన నివాళులర్పించారు.

గుండూరు మునెమ్మ మృతికి జనసేన నాయకుడు దండి నరేంద్ర అశ్రునివాళి