గురుకుల కళాశాలలో కంటి వైద్య శిబిరం,
పున్నమి న్యూస్ డి హరికృష్ణ వాకాడు మండలం జులై 16,
మండల కేంద్రమైన వాకాడు లోనే ఏపీఎస్ డబ్ల్యూ ఆర్ గురుకుల కళాశాల ఆవరణలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.
జిల్లా అందత్వ నివారణ సంస్థ తిరుపతి వారి ఆదేశాల మేరకు వాకాడు మండలం బాల్రెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేత్ర వైద్య నిపుణులు జీ వి రమణ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో గురుకులంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అందత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నెరవేస్తున్న ఈ వైద్య శిబిరంలో ఎం వి రావు ఫౌండేషన్ వారి సహాయ సహకారాలు అందించి వారికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసి ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.
ఈ కంటి వైద్య శిబిరంలో కంటి వైద్య నిపుణులు రమణ కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారికి గుర్తించి వారికి కంటి అద్దాలు అవసరమైన వారిని గుర్తించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సురేష్ తో పాటు ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి, కంటి వైద్య బృందం వైద్య నిపుణులు జీవివి రమణ, వైద్య బృందం, కళాశాలల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.



