Sunday, 12 July 2026
  • Home  
  • జాతీయ లోక్ అదాలత్ విజయవంతం.. యలమంచిలిలో 1,479 కేసులకు సామరస్య పరిష్కారం.
- అనకాపల్లి

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం.. యలమంచిలిలో 1,479 కేసులకు సామరస్య పరిష్కారం.

అనకాపల్లి జిల్లా, జూలై 12 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి స్థానిక కోర్టుల సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విశేష విజయాన్ని సాధించింది. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) పి. విజయ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి. స్పందన, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సివిల్, క్రిమినల్, పీఎల్‌సీ విభాగాలకు సంబంధించిన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 1,479 కేసులు పరస్పర అంగీకారం, రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. కక్షిదారులు స్వచ్ఛందంగా రాజీకి ముందుకు రావడంతో వివాదాలు త్వరితగతిన ముగియగా, న్యాయస్థానాలపై ఉన్న కేసుల భారం కూడా గణనీయంగా తగ్గింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెంపొందించడంతో పాటు, సమయం, ధనం ఆదా చేసే వేదికగా లోక్ అదాలత్ నిలిచిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి. రమణ, ఉపాధ్యక్షుడు ఎల్.వి.ఆర్.కె. రావు, లోక్ అదాలత్ సభ్యుడు డి. వెంకటరావు, ఏజీపీ డి. నూకరాజు, టి. నూతన్ రాజు, స్థానిక న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అనకాపల్లి జిల్లా, జూలై 12 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
యలమంచిలి స్థానిక కోర్టుల సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విశేష విజయాన్ని సాధించింది. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) పి. విజయ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి. స్పందన, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సివిల్, క్రిమినల్, పీఎల్‌సీ విభాగాలకు సంబంధించిన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 1,479 కేసులు పరస్పర అంగీకారం, రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి.
కక్షిదారులు స్వచ్ఛందంగా రాజీకి ముందుకు రావడంతో వివాదాలు త్వరితగతిన ముగియగా, న్యాయస్థానాలపై ఉన్న కేసుల భారం కూడా గణనీయంగా తగ్గింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెంపొందించడంతో పాటు, సమయం, ధనం ఆదా చేసే వేదికగా లోక్ అదాలత్ నిలిచిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి. రమణ, ఉపాధ్యక్షుడు ఎల్.వి.ఆర్.కె. రావు, లోక్ అదాలత్ సభ్యుడు డి. వెంకటరావు, ఏజీపీ డి. నూకరాజు, టి. నూతన్ రాజు, స్థానిక న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.