శ్రీ కాళహస్తి, జులై 04 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని పలు వీధుల్లో వీధి కుక్కల సంచారం అధికంగా పెరగడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుక్కలు కరిచిన ఘటనలు చోటుచేసుకోవడంతో ఆందోళన చెందిన స్థానికులు శనివారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ సమస్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. జంతు సంక్షేమ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వీధి కుక్కలను సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు పురపాలక సంఘం ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. పట్టణ ప్రజల సహకారంతో శ్రీకాళహస్తిని పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రజా ఫిర్యాదుతో రంగంలోకి మున్సిపాలిటీ.. వీధి కుక్కల పట్టివేత