Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కుమురం భీమ్ ఆసిఫాబాద్

80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

వార్త ముఖ్యాంశాలు

  • కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా( పున్నమి ప్రతినిధి ) జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని అన్నారు.
  • ఈ పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా( పున్నమి ప్రతినిధి ) జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని అన్నారు. ఈ పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ గారు, వైస్ చైర్మన్ అహ్మద్ గారు, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్ గారు, కౌన్సిలర్లు సలాం గారు, నాగుబాయి గారు, పార్టీ నాయకులు, అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *