Saturday, 27 June 2026
  • Home  
  • పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో

మర్రిపాడు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం మర్రిపాడు సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా మర్రిపాడు నుంచి ఆత్మకూరు వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేయాలని రైతు సంఘం నిర్ణయించింది. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించి, ట్రాక్టర్లతో వెళ్లేందుకు వీల్లేదని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు నిర్బంధించారు.దీనికి నిరసనగా రైతులు, రైతు సంఘం నాయకులు మర్రిపాడు సెంటర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసుల నిర్బంధాన్ని లెక్కచేయకుండా రైతులు ఆందోళన కొనసాగించడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పొగాకు రైతులకు ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం మాజీ జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్, జిల్లా కార్యదర్శి మూల వెంకయ్య, ఉదయగిరి నియోజకవర్గ రైతు సంఘం నాయకుడు కాకి వెంకటయ్య, వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు గంగవరం శ్రీనివాస్ నాయుడు, యువ నాయకుడు సండ్ర నారాయణస్వామి, సీపీఎం మండల కార్యదర్శి సహజరంతుల్లా, సీఐటీయూ మండల కార్యదర్శి బత్తల రత్నయ్య, భవన నిర్మాణ కార్మికుల మండల కార్యదర్శి దండు జాన్సన్, వివిధ రైతు సంఘాల నాయకులు, డీవైఎఫ్‌ఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

మర్రిపాడు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం మర్రిపాడు సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా మర్రిపాడు నుంచి ఆత్మకూరు వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేయాలని రైతు సంఘం నిర్ణయించింది.
అయితే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించి, ట్రాక్టర్లతో వెళ్లేందుకు వీల్లేదని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు నిర్బంధించారు.దీనికి నిరసనగా రైతులు, రైతు సంఘం నాయకులు మర్రిపాడు సెంటర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసుల నిర్బంధాన్ని లెక్కచేయకుండా రైతులు ఆందోళన కొనసాగించడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పొగాకు రైతులకు ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం మాజీ జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్, జిల్లా కార్యదర్శి మూల వెంకయ్య, ఉదయగిరి నియోజకవర్గ రైతు సంఘం నాయకుడు కాకి వెంకటయ్య, వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు గంగవరం శ్రీనివాస్ నాయుడు, యువ నాయకుడు సండ్ర నారాయణస్వామి, సీపీఎం మండల కార్యదర్శి సహజరంతుల్లా, సీఐటీయూ మండల కార్యదర్శి బత్తల రత్నయ్య, భవన నిర్మాణ కార్మికుల మండల కార్యదర్శి దండు జాన్సన్, వివిధ రైతు సంఘాల నాయకులు, డీవైఎఫ్‌ఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.