Sunday, 14 June 2026
  • Home  
  • ఎన్డీయే రెండేళ్ల పాలనకు అభినందనలు తెలిపిన కోలా ఆనంద్
- తిరుపతి

ఎన్డీయే రెండేళ్ల పాలనకు అభినందనలు తెలిపిన కోలా ఆనంద్

శ్రీకాళహస్తి, జూన్ 13, (పున్నమి న్యూస్) : తిరుపతి సమీపంలోని దామినేడులో ఎన్డీయే కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” అనే నినాదంతో జరిగిన ఈ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుండటం అభినందనీయమని కోలా ఆనంద్ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. ఈ విజయోత్సవ సభలో కూటమి అగ్రనేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.