Tuesday, 9 June 2026
  • Home  
  • డ్రోన్ల ఎగరవేతపై కఠిన నిషేధం సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీసుల కీలక ఉత్తర్వులు
- E-పేపర్

డ్రోన్ల ఎగరవేతపై కఠిన నిషేధం సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీసుల కీలక ఉత్తర్వులు

డ్రోన్ల ఎగరవేతపై కఠిన నిషేధం సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీసుల కీలక ఉత్తర్వులు పున్నమి న్యూస్ హైదరాబాద్, జూన్ 9 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 2026 జూన్ 10న మీర్‌ఖాన్‌పేట్‌లో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా పరమైన చర్యలను కట్టుదిట్టం చేస్తూ ఫ్యూచర్ సిటీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎగరవేతను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిషేధం 10.06.2026 తేదీ మొత్తం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ భద్రతా మార్గదర్శకాలు, నిఘా సంస్థల హెచ్చరికలు మరియు ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా డ్రోన్ల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘవిద్రోహ, ఉగ్రవాద శక్తులు ఆధునిక వైమానిక పరికరాలను దుర్వినియోగం చేసే అవకాశాలను పరిగణనలోకి తీసుకొని ప్రజల ప్రాణ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీసులు వెల్లడించారు. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వ్యక్తులు, సంస్థలపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. డ్రోన్ ఆపరేటర్లు, ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్ నిర్వాహకులు, మీడియా ప్రతినిధులు మరియు ప్రజలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ నిషేధాజ్ఞలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించడంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ఉత్తర్వులను ప్రదర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు కోరారు.

డ్రోన్ల ఎగరవేతపై కఠిన నిషేధం
సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీసుల కీలక ఉత్తర్వులు

పున్నమి న్యూస్
హైదరాబాద్, జూన్ 9
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 2026 జూన్ 10న మీర్‌ఖాన్‌పేట్‌లో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా పరమైన చర్యలను కట్టుదిట్టం చేస్తూ ఫ్యూచర్ సిటీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎగరవేతను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిషేధం 10.06.2026 తేదీ మొత్తం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ భద్రతా మార్గదర్శకాలు, నిఘా సంస్థల హెచ్చరికలు మరియు ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా డ్రోన్ల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సంఘవిద్రోహ, ఉగ్రవాద శక్తులు ఆధునిక వైమానిక పరికరాలను దుర్వినియోగం చేసే అవకాశాలను పరిగణనలోకి తీసుకొని ప్రజల ప్రాణ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీసులు వెల్లడించారు.
ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వ్యక్తులు, సంస్థలపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. డ్రోన్ ఆపరేటర్లు, ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్ నిర్వాహకులు, మీడియా ప్రతినిధులు మరియు ప్రజలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ఈ నిషేధాజ్ఞలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించడంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ఉత్తర్వులను ప్రదర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటనను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.