Saturday, 6 June 2026
  • Home  
  • కోహెడ ఫ్రూట్ మార్కెట్ బాధిత రైతులకు సంఘీభావం నాగోల్ పోలీస్ స్టేషన్‌లో రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి
- E-పేపర్

కోహెడ ఫ్రూట్ మార్కెట్ బాధిత రైతులకు సంఘీభావం నాగోల్ పోలీస్ స్టేషన్‌లో రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి

కోహెడ ఫ్రూట్ మార్కెట్ బాధిత రైతులకు సంఘీభావం నాగోల్ పోలీస్ స్టేషన్‌లో రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి పున్నమి న్యూస్ 06 జూన్ 2026 తెలంగాణ ఇంచార్జి కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం పేరుతో రైతుల భూములు స్వాధీనం చేసుకుని, కనీస నష్టపరిహారం కూడా చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి ఆరోపించారు. ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనకు నిరసనగా ఆందోళన చేస్తున్న బాధిత రైతులు, భూబాధితులు మరియు స్థానిక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులను ఈరోజు తెల్లవారుజామునే అక్రమంగా అరెస్ట్ చేసి నాగోల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన దండెం రాంరెడ్డి ఈరోజు మధ్యాహ్నం నాగోల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అరెస్టైన రైతులు, భూబాధితులు మరియు వివిధ పార్టీల నాయకులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించే వరకు పోరాటం కొనసాగుతుందని, రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను దండెం రాంరెడ్డికి వివరించగా, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కోహెడ ఫ్రూట్ మార్కెట్ బాధిత రైతులకు సంఘీభావం
నాగోల్ పోలీస్ స్టేషన్‌లో రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి

పున్నమి న్యూస్
06 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి

కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం పేరుతో రైతుల భూములు స్వాధీనం చేసుకుని, కనీస నష్టపరిహారం కూడా చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి ఆరోపించారు.
ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనకు నిరసనగా ఆందోళన చేస్తున్న బాధిత రైతులు, భూబాధితులు మరియు స్థానిక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులను ఈరోజు తెల్లవారుజామునే అక్రమంగా అరెస్ట్ చేసి నాగోల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు.
ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన దండెం రాంరెడ్డి ఈరోజు మధ్యాహ్నం నాగోల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అరెస్టైన రైతులు, భూబాధితులు మరియు వివిధ పార్టీల నాయకులను పరామర్శించి సంఘీభావం తెలిపారు.
రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించే వరకు పోరాటం కొనసాగుతుందని, రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను దండెం రాంరెడ్డికి వివరించగా, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.