నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కు చెందిన 25 మంది నాయకులపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దేశంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థను కూలదోసి షరియా చట్టాల ఆధారిత వ్యవస్థను నెలకొల్పేందుకు కుట్ర జరిగిందనే అనుమానాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. విచారణలో బయటపడిన ఆధారాల ప్రకారం కొందరు జాతీయ స్థాయిలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగా, మరికొందరు నియామకాలు, శిక్షణ, నిధుల సమీకరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించిన కీలక విచారణగా భావిస్తున్నారు.

పీఎఫ్‌ఐ నేతలపై అభియోగాల నమోదుకు ఢిల్లీ కోర్టు ఆదేశం