ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 5 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలం కంటేపల్లిలో ప్రభుత్వ భూములు, స్థలాల ఆక్రమణలపై చర్యలు తప్పవని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు హెచ్చరించారు. ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడుతో కలిసి గ్రామ సచివాలయం, రైస్ మిల్లు సమీప ప్రాంతాల్లో పరిశీలించారు. గతంలో జరిగిన ఆక్రమణలను గుర్తించి పూర్తి స్థాయి సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చెరువులు, పంచాయతీ స్థలాలు, పేదలకు కేటాయించిన భూముల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తప్పవు: బొబ్బేపల్లి సురేష్ నాయుడు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 5 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం కంటేపల్లిలో ప్రభుత్వ భూములు, స్థలాల ఆక్రమణలపై చర్యలు తప్పవని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు హెచ్చరించారు. ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడుతో కలిసి గ్రామ సచివాలయం, రైస్ మిల్లు సమీప ప్రాంతాల్లో పరిశీలించారు. గతంలో జరిగిన ఆక్రమణలను గుర్తించి పూర్తి స్థాయి సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చెరువులు, పంచాయతీ స్థలాలు, పేదలకు కేటాయించిన భూముల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

