నెల్లూరు: ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన ప్రసిద్ధ నవల ‘మట్టి మనిషి’ ఆధారంగా రూపొందించిన నాటకం ఆదివారం నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఉచితంగా ప్రదర్శించనున్నారు. అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ నాటకీకరించిన ఈ నాటకానికి యస్.ఎం. భాషా దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు నగరాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడిన ఈ నాటకం మట్టి–మనిషి సంబంధాలను, భూమిని వ్యాపార వస్తువుగా మార్చిన సమాజంలోని దుష్పరిణామాలను ఆవిష్కరిస్తుంది. నాటకాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కన్వీనర్ చిరసాని కోటిరెడ్డి కోరారు.

మట్టి మనిషి నాటక ప్రదర్శన : వల్లూరు శివప్రసాద్