గూడూరు: లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ, టౌన్ & వెస్ట్ క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జూన్ 1 నుండి 5వ తేదీ వరకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఒలింపియాడ్ కోర్సుల్లో ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ సహకారంతో శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఉచిత విద్య అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.



