Thursday, 4 June 2026
  • Home  
  • కొత్త క్రిమినల్ చట్టాలు, ‘శక్తి’ యాప్‌పై అవగాహన
- ఎలూరు

కొత్త క్రిమినల్ చట్టాలు, ‘శక్తి’ యాప్‌పై అవగాహన

. మండవల్లిలో ఏఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సదస్సు మండవల్లి జూన్ 4: స్థానిక నాగేంద్రస్వామి ఆలయం వద్ద గురువారం కొత్త క్రిమినల్ చట్టాలు, మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన ‘శక్తి’ యాప్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఏఎస్ఐ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని, దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త చట్టాల ముఖ్యాంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాత చట్టాల స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS), మరియు భారతీయ సాక్ష్యాధార చట్టం (BSA) ల వల్ల న్యాయవ్యవస్థలో వచ్చిన కీలక మార్పులను, పౌరుల హక్కులను సులభంగా అర్థమయ్యేలా చెప్పారు “మహిళల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి’ యాప్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఈ యాప్‌ను వినియోగించడం ద్వారా తక్షణమే పోలీసు సహాయం పొందవచ్చు.” అని ఏఎస్ఐ రాజు పేర్కొన్నారు. ప్రజలందరూ చట్టాలపై కనీస అవగాహన పెంపొందించుకోవాలని, మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న సాంకేతికతను మరియు యాప్‌లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ అవగాహన సదస్సులో పోలీస్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో గ్రామస్థులు అడిగిన పలు సందేహాలకు ఏఎస్ఐ రాజు నివృత్తి చేశారు.

. మండవల్లిలో ఏఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సదస్సు

మండవల్లి జూన్ 4:
స్థానిక నాగేంద్రస్వామి ఆలయం వద్ద గురువారం కొత్త క్రిమినల్ చట్టాలు, మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన ‘శక్తి’ యాప్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఏఎస్ఐ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని, దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త చట్టాల ముఖ్యాంశాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాత చట్టాల స్థానంలో వచ్చిన
భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS), మరియు భారతీయ సాక్ష్యాధార చట్టం (BSA) ల వల్ల న్యాయవ్యవస్థలో వచ్చిన కీలక మార్పులను, పౌరుల హక్కులను సులభంగా అర్థమయ్యేలా చెప్పారు
“మహిళల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి’ యాప్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఈ యాప్‌ను వినియోగించడం ద్వారా తక్షణమే పోలీసు సహాయం పొందవచ్చు.” అని ఏఎస్ఐ రాజు పేర్కొన్నారు.
ప్రజలందరూ చట్టాలపై కనీస అవగాహన పెంపొందించుకోవాలని, మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న సాంకేతికతను మరియు యాప్‌లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
ఈ అవగాహన సదస్సులో పోలీస్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో గ్రామస్థులు అడిగిన పలు సందేహాలకు ఏఎస్ఐ రాజు నివృత్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.