Wednesday, 3 June 2026
  • Home  
  • కూటమి రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ పోరు బాట-పోస్టర్ ఆవిష్కరణ
- తిరుపతి

కూటమి రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ పోరు బాట-పోస్టర్ ఆవిష్కరణ

శ్రీ కాళహస్తి, జూన్ 03, (పున్నమి న్యూస్) : చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, బుక్‌లెట్‌ను మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన నమ్మశక్యం కాని హామీలు, మాయమాటలు నమ్మి ఓటు వేసినందుకు ప్రజలు ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారని పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలును, అందించిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. గతంలో జగనన్న ప్రభుత్వం ఎటువంటి ప్రచారం లేకుండా ప్రతి నెలా పింఛన్లు అందిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రచారం కోసమే ఆర్భాటం చేస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు వరి మద్దతు ధర లభించడం లేదని, ఎరువుల కొరత వేధిస్తోందని, ఏ ఒక్క సంక్షేమ పథకం సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది తల్లిదండ్రులు పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక చదువులు ఆపేసి పనులకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజలకు చేసిన ఈ ‘వెన్నుపోటు’ పాలనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జూన్ 4 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూర తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి, కోగీలి సుబ్రమణ్యం, గున్నేరు కిషోర్ రెడ్డి, ఉత్తరాజి సర్వన కుమార్, బుల్లెట్ జై శ్యామ్ రాయల్, కంటా ఉదయ్ కుమార్, మున్నా రాయల్, శ్రీవారి సురేష్, పులి రామచంద్ర, శివకుమార్ యాదవ్, చెంచయ్య నాయుడు, మధు రెడ్డి, మహబూబ్ బాషా, జూమ్లేష, గౌస్ బాషా, కుమార్, వయ్యాల మనోహర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, గంగిరెడ్డి, మణి నాయుడు, శ్రీరాముల్ రెడ్డి, అల్లయ్య, కాణిపాకం సురేష్, పసలు కృష్ణయ్య, చింతా రాజేంద్ర, సాగిర బి, మోహన ప్రియా, ఆవుల శ్రీనివాసులు, నాగార్జున రెడ్డి, బత్తి శెట్టి, బాబు, చంగల్ రాయలు, అస్లాం, సునీల్, మళ్లీ మొదలియార్, గంగాధరం, సర్వనా, రంగయ్య, నారాయణ, రాజేంద్ర, భాను, చుక్కల నిడిగలు ఎల్లయ్య, జయకృష్ణ, జీవీకే రెడ్డి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.