Wednesday, 3 June 2026
  • Home  
  • క్రీడాకారులను అవమానిస్తే యువత ఊరుకోదు-శ్రీకాళహస్తి టీడీపీ నాయకుల హెచ్చరిక
- తిరుపతి

క్రీడాకారులను అవమానిస్తే యువత ఊరుకోదు-శ్రీకాళహస్తి టీడీపీ నాయకుల హెచ్చరిక

శ్రీ కాళహస్తి, జూన్ 03, (పున్నమి న్యూస్) : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయ నియామకాలపై జగన్ రెడ్డి బృందం చేస్తున్న అసత్య ఆరోపణలు, దుర్మార్గపు ప్రచారాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో తమకు రాజకీయ సమాధి కట్టిన ఆంధ్రప్రదేశ్ యువతపై కసితోనే వైసిపి ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర యువతను గంజాయికి బానిసలుగా మార్చి నిర్వీర్యం చేయడమే కాకుండా, క్రీడాకారులను అవమానించేలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను నోటిఫై చేయగా, అందులో 3 శాతం క్రీడా కోటా కింద 421 పోస్టులను కేటాయించామని స్పష్టం చేశారు. ఈ నియామక ప్రక్రియలో 3,600 మంది అభ్యర్థుల నుండి 5,326 దరఖాస్తులు రాగా, తుది ఎంపికలో 382 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయని, ఇంకా 39 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని గణాంకాలతో వివరించారు. కొన్ని పోస్టులు ఖాళీగా మిగిలిపోవడాన్ని చూస్తేనే, ఈ ఎంపిక ప్రక్రియ ఎంత పారదర్శకంగా, కేవలం అర్హత, ప్రాధాన్యత మరియు ప్రభుత్వ నిబంధనల ఆధారంగానే జరిగిందో స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ నిజాన్ని గ్రహించకుండా తెలివితక్కువగా మాట్లాడుతున్న జగన్ రెడ్డి బృందానికి రాష్ట్ర యువత తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, తిరుపతి పార్లమెంటు నాయకులు గంగనపల్లి రమేష్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.