Tuesday, 2 June 2026
  • Home  
  • సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన గంటా*
- News - ఆంధ్రప్రదేశ్ - విశాఖపట్నం

సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన గంటా*

సాగర్ నగర్, జూన్ 1:_ సంక్షేమ పథకాల అమలు ద్వారా పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. సాగర్ నగర్ లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. పెన్షన్లు, జీతాలు ప్రతి నెల 1 వ తేదీన క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామన్నారు. ప్రతి నెల రాష్ట్రవ్యాప్తంగా 62.34 లక్షల మందికి రూ. 2,728 కోట్లు నేరుగా నగదు పెన్షన్ల రూపంలో అందిస్తున్నామని.. భీమిలి నియోజకవర్గంలో 14 వేల మందికి రూ.6.34 కోట్లు ఇస్తున్నామని వివరించారు. ఈనెల స్పౌజ్ కోటాలో 5606 మంది వితంతువులకు సామాజిక పెన్షన్లు అందించామన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ప్రతి హామీ నెరవేర్చి వారి నమ్మకం గెలుచుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, చెట్టుపల్లి సన్యాసిరావు, శాఖారి శ్రీనివాస్, లొడగల అప్పారావు, సారిపల్లి శ్రీనివాస్, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.