కాశిరెడ్డి కాలనీలో పోలీసుల కార్డెన్ సర్చ్
ప్రకాశం జిల్లా కనిగిరి టౌన్‌లోని కాశిరెడ్డి కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాలు, కనిగిరి ఇన్చార్జి డీఎస్పీ శ్రీధర్ మార్గదర్శకత్వంలో సీఐ యు. శ్రీనివాసులు, ఎస్సై జి. సందీప్, హెచ్‌ఎంపాడు ఎస్సై టి. రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మూడు పోలీస్ స్టేషన్ల సిబ్బంది కలిసి అనుమానాస్పద ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని 41 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీవాసులకు డ్రగ్స్ దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

కాశిరెడ్డి కాలనీలో పోలీసుల కార్డెన్ సర్చ్
కాశిరెడ్డి కాలనీలో పోలీసుల కార్డెన్ సర్చ్ ప్రకాశం జిల్లా కనిగిరి టౌన్‌లోని కాశిరెడ్డి కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాలు, కనిగిరి ఇన్చార్జి డీఎస్పీ శ్రీధర్ మార్గదర్శకత్వంలో సీఐ యు. శ్రీనివాసులు, ఎస్సై జి. సందీప్, హెచ్‌ఎంపాడు ఎస్సై టి. రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మూడు పోలీస్ స్టేషన్ల సిబ్బంది కలిసి అనుమానాస్పద ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని 41 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీవాసులకు డ్రగ్స్ దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

