Saturday, 23 May 2026
  • Home  
  • మాన్యం ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం – దుస్తుల పంపిణీ
- తూర్పు గోదావరి

మాన్యం ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం – దుస్తుల పంపిణీ

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పు గోదావరి రంప చోడవరం మండలం నూనెపల్లి గ్రామంలో మానవ హక్కుల పరిరక్షణ మరియు అవగాహన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. మాన్యం ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని రక్తపోటు, మధుమేహం, ఎముకల సమస్యలు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సలహాలు అందించడంతో పాటు అవసరమైన మందులు మరియు దుస్తులను ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 50 కుటుంబాలు ఈ వైద్య శిబిరం ద్వారా లబ్ధి పొందినట్లు సంస్థ అధ్యక్షులు సత్య గుమ్మాపు తెలిపారు. ఈ సందర్భంగా సత్య గుమ్మాపు, కడలి సత్యనారాయణ, డాక్టర్ కె.ఎం. జగదీష్ నాయుడు, బిందు చౌదరి, పిచ్చుక మహేష్, పచ్చిపాల కళ్యాణి, ఆడారి దుర్గ, ఉప్పాడ మౌనిక రెడ్డి, పచ్చిపాల వీరబాబు, కర్రీ అరుణ్ కుమార్, ఏరువ మీనాక్షి రెడ్డి గొల్లవెల్లి శ్రీనివాస్, దేవి, కొమ్మిరెడ్డి ప్రభవతి, వందన కుమార్, గుంటూరు రమణ, శ్రీ హరి తదితరులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండడం ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. పేద మరియు వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు. అదేవిధంగా హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్ జాన్ వెస్లీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ జగదీష్ నాయుడు అభినందనలు తెలిపారు. సమాప్తం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పు గోదావరి రంప చోడవరం మండలం నూనెపల్లి గ్రామంలో మానవ హక్కుల పరిరక్షణ మరియు అవగాహన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. మాన్యం ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.
ఈ శిబిరంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని రక్తపోటు, మధుమేహం, ఎముకల సమస్యలు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సలహాలు అందించడంతో పాటు అవసరమైన మందులు మరియు దుస్తులను ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 50 కుటుంబాలు ఈ వైద్య శిబిరం ద్వారా లబ్ధి పొందినట్లు సంస్థ అధ్యక్షులు సత్య గుమ్మాపు తెలిపారు.
ఈ సందర్భంగా సత్య గుమ్మాపు, కడలి సత్యనారాయణ, డాక్టర్ కె.ఎం. జగదీష్ నాయుడు, బిందు చౌదరి, పిచ్చుక మహేష్, పచ్చిపాల కళ్యాణి, ఆడారి దుర్గ, ఉప్పాడ మౌనిక రెడ్డి, పచ్చిపాల వీరబాబు, కర్రీ అరుణ్ కుమార్, ఏరువ మీనాక్షి రెడ్డి
గొల్లవెల్లి శ్రీనివాస్, దేవి, కొమ్మిరెడ్డి ప్రభవతి, వందన కుమార్, గుంటూరు రమణ, శ్రీ హరి తదితరులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండడం ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. పేద మరియు వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు.
అదేవిధంగా హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్ జాన్ వెస్లీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ జగదీష్ నాయుడు అభినందనలు తెలిపారు.

సమాప్తం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.