Monday, 27 April 2026
  • Home  
  • ప్రముఖ న్యాయవాది పసల పొన్నారావు మృతి – న్యాయ రంగానికి తీరని లోటు
- తిరుపతి

ప్రముఖ న్యాయవాది పసల పొన్నారావు మృతి – న్యాయ రంగానికి తీరని లోటు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 27 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది పసల పొన్నారావు అకస్మాత్తుగా మృతి చెందడం న్యాయ వర్గాలను విషాదంలో ముంచింది. ఆయన మరణం పట్ల సహచర న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పసల పొన్నారావు 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు భారత డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ పలు కీలక న్యాయ వ్యవహారాల్లో తన సేవలను అందించారు. న్యాయపరమైన అంశాలలో ఆయనకు ఉన్న పట్టు, వృత్తిపరమైన నిబద్ధతతో మంచి గుర్తింపు పొందారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 1వ వార్డు వీఎం పల్లిలో నివాసముంటున్న ఆయన మంగళవారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి న్యాయ రంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.