ముస్తాబాద్ ఏప్రిల్ పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్, ఏప్రిల్ 11: సమాజ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఫూలే గారి విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల ముదిరాజ్ సంఘం మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు ఫూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. విద్యా విస్తరణ, సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఫూలే గారు చేసిన కృషి అపారమని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ హోదాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా, ఐక్యతకు ప్రతీకగా జరిగింది.



