శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి పట్టణంలోని బహుదూర్పేటలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ నల్లగంగమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ నల్లగంగమ్మ తల్లికి ముక్కంటి సారే సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతి సంవత్సరం నల్ల గంగమ్మ తల్లి జాతరలో ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని అమ్మవారికి సారే సమర్పించడం తనకు ఆనందంగా ఉందని భవిష్యత్తులో కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధితో పాటు అనుబంధ ఆలయాలు, పరిసర ప్రాంతాల ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగంగమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కంటా రమేష్, ఆలయ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

నల్లగంగమ్మ తల్లికి ముక్కంటి సారె అందజేసిన దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి