Thursday, 5 March 2026
  • Home  
  • ఖమ్మం 21వ డివిజన్‌లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం – ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: పిల్లల మర్రి వెంకట్ రజిత
- ఖమ్మం

ఖమ్మం 21వ డివిజన్‌లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం – ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: పిల్లల మర్రి వెంకట్ రజిత

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలోని 21వ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “ఇంటింటికి బీజేపీ” కార్యక్రమం కొనసాగుతోంది. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లలమర్రి రజిత–వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకుడు తలారి చంద్రశేఖర్ పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. డివిజన్‌లో పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

ఖమ్మం నగరంలోని 21వ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “ఇంటింటికి బీజేపీ” కార్యక్రమం కొనసాగుతోంది. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లలమర్రి రజిత–వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఓటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకుడు తలారి చంద్రశేఖర్ పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.

డివిజన్‌లో పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.