Wednesday, 4 March 2026
  • Home  
  • ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 15 డివిజన్‌ల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం — రెండవ పట్టణ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ఆశాభావం
- ఖమ్మం

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 15 డివిజన్‌ల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం — రెండవ పట్టణ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ఆశాభావం

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం రెండవ పట్టణ పరిధిలోని 15 డివిజన్‌లలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పున్నమి దినపత్రిక జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఖమ్మం రెండవ పట్టణ పరిధిలోని ప్రతి డివిజన్‌లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారం దిశగా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బీజేపీ నాయకత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఖమ్మం నగర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలే నగర ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. ఈ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్తూన్నాం అని దీని వల్ల బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయని, అదే ఉత్సాహంతో ఖమ్మంలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని ధనియాకుల వెంకట్ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తారని, ఖమ్మం రెండవ పట్టణంలో అన్ని డివిజన్ లలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం అని ఆయన స్పష్టం చేశారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం రెండవ పట్టణ పరిధిలోని 15 డివిజన్‌లలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పున్నమి దినపత్రిక జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఖమ్మం రెండవ పట్టణ పరిధిలోని ప్రతి డివిజన్‌లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారం దిశగా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బీజేపీ నాయకత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఖమ్మం నగర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలే నగర ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. ఈ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్తూన్నాం అని దీని వల్ల బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయని, అదే ఉత్సాహంతో ఖమ్మంలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని ధనియాకుల వెంకట్ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తారని, ఖమ్మం రెండవ పట్టణంలో అన్ని డివిజన్ లలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం అని ఆయన స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.