*గుండోజీ రంగాదాసు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నూతన కార్యవర్గ ఎన్నిక*
పున్నమి న్యూస్ ప్రతినిధి
02 మార్చి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బండరావిరాల గ్రామంలో *”గుండోజీ రంగదాసు ఎడ్యుకేషనల్ ట్రస్ట్”* నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించబడింది.
ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
గ్రామ అభివృద్ధి, విద్య మరియు సామాజిక సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ క్రింది సభ్యులను వివిధ బాధ్యతలకు ఎంపిక చేశారు.
*నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:*
సలహాదారులు: కోదాసు శ్యామ్ సుందర్, నెమరగోముల ముత్యాలు, ఏర్పుల నవీన్ కుమార్.
అధ్యక్షులు : ఏర్పుల నరేష్
ప్రధాన కార్యదర్శి: కొత్త ప్రశాంత్ గౌడ్
ఉపాధ్యక్షులు: కందికంటి నిఖిల, నెమరగోముల కరుణ్, ఒంగూరి రమేష్.
కోశాధికారి: కందికంటి మధు
సహయ కార్యదర్శులు: పిల్లి పూజిత, ఏమ్ముల శివ శంకర్.
ఈ సందర్భంగా సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని, నూతన కార్యవర్గం గ్రామ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ట్రస్ట్ ద్వారా విద్యా పరమైన సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఏర్పుల నరేష్ మరియు ఇతర సభ్యులు తమపై ఉంచిన నమ్మకానికి సర్పంచ్ కి, అడ్వైజర్లకు మరియు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా స్వచ్ఛందంగా విద్యార్థులకు విద్యనందిస్తున్న ట్యూటర్లను ట్రస్టు సభ్యులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూస శంకర్ ముదిరాజ్ , వార్డు సభ్యులు గుండ్ల భవాని – శివ ముదిరాజ్ , ఏర్పుల హరికృష్ణ గ్రామ యువకులు కందికంటి కృష్ణ , ట్యూషన్ పాయింట్ కమాండర్లు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



