శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసన సబ్యులు, మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్మారకార్థం సోమవారం నాడు జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ను బొజ్జల బృందమ్మ ప్రారంభించారు. బొజ్జల–విక్రమ్ విద్యా సంస్థలు & ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్మారకార్థం “BOJJALA VIKRAM–AISTA 4వ జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్” ఫిబ్రవరి 21 నుండి 27 వరకు దక్షిణ కైలాస్ నగర్‌లోని విక్రమ్ టెన్నిస్ అకాడమీ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుండి సీనియర్ టెన్నిస్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొని పోటీలు రసవత్తరంగా సాగిస్తున్నారు.విక్రమ్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొజ్జల బృందమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా బృందమ్మ మాట్లాడుతూ.. క్రీడా స్పూర్తి పెంపొందించేందుకు ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి క్రీడల పట్ల అపారమైన అభిమానం కలిగిన నాయకుడని, యువతను క్రీడల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ఎప్పుడూ ప్రోత్సహిస్తారని విక్రమ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందదాయకమని ఆమె ప్రశంసించారు. అనంతరం డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ….భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్లను నిర్వహించి, శ్రీకాళహస్తిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని బొజ్జల–విక్రమ్–ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సేవలను స్మరించుకుంటూ క్రీడా రంగానికి ప్రేరణగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ ముని లక్ష్మి, రామకృష్ణ యాదవ్, రిటైర్డ్ జిల్లా జడ్జి రామకృష్ణ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ని ప్రారంభించిన బొజ్జల బృందమ్మ