అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 23 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్):
ఎలమంచిలి రూరల్ మండలంలోని ములకలపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామాభివృద్ధి దిశగా కీలకమైన ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఎలమంచిలి మండల రూరల్ అధ్యక్షుడు అన్నం బాబ్జీ చేతుల మీదుగా ప్రారంభించారు.
గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సీసీ రోడ్ల పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “ములకలపల్లి గ్రామ అభివృద్ధి మా ప్రాధాన్యత. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో ఎలమంచిలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి” అని పేర్కొన్నారు.
మిగతా గ్రామాల్లో కూడా త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని హర్షాతిరేకంతో స్వాగతించారు.



