బుధవారం మండలంలోని బిజెపి నాయకులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి కార్యశాల సమావేశం ఏర్పాట్లు చర్చించారు.
రామచంద్రపురం 18 ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి
రామచంద్రాపురం మండలం రాయల రాయల కట్ట దిగువన రాయల మండపంలో మండల బిజెపి పార్టీ విస్తృతస్థాయి సమావేశం మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం మండలంలోని సి రామాపురంలో తిరుపతి జిల్లా కార్యశాల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లాలోని అన్ని మండలాల బిజెపి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, రాష్ట్ర బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శులు, పలువురు ప్రముఖులు వస్తున్నట్లు తెలిపారు. శనివారం జరిగే సమావేశం మండలంలోని బిజెపి నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసే జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Uploaded Video:





