వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
తాళ్లపూడి:(పున్నమి ప్రతినిధి చందు )తాళ్లపూడి మండలంలోని పెద్దేవం గ్రామంలో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.42 లక్షల వ్యయంతో మంజూరైన హెల్త్ క్లినిక్‌కు, అలాగే తాళ్లపూడి గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో మంజూరైన విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, జనసేన నాయకులు టీవీ రామారావు, సిద్ధ దుర్గాప్రసాద్, నామన పరమేష్, బోడపాటి గంగరాజు, గెడ్డం సాయిబాబా, కోడి శంకరం, వీర హరిబాబు, నామన చిన్న బూరయ్య, తిగిరిపల్లి గోపి, తిగిరిపల్లి కనకరత్నం, సంతులు, మద్దిపాటి ప్రకాశం, మద్దిపాటి రామారావు, కొటారు వెంకట్రావు, ఉడతా వీరేంద్ర, గెడ్డం జగన్, చలపాటి ప్రకాష్, కైగాల రాంబాబు, ఉప్పులూరి రమేష్ తదితర ఎన్‌డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై హర్షం వ్యక్తం చేశారు.
Uploaded Video:
