Tuesday, 24 March 2026
  • Home  
  • గాజువాక డిపోలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం – డ్రైవర్లకు ఫ్యామిలీ కౌన్సిలింగ్
- విశాఖపట్నం

గాజువాక డిపోలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం – డ్రైవర్లకు ఫ్యామిలీ కౌన్సిలింగ్

గాజువాక, (పున్నమి ప్రతినిధి): జాతీయ రహదారి భద్రతా మాసము కార్యక్రమంలో భాగంగా గురువారం గాజువాక డిపోలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా యాక్సిడెంట్ మరియు డ్యామేజ్ డ్రైవర్లకు రహదారి భద్రత, ప్రమాద రహిత డ్రైవింగ్ విధానాలు, రహదారి నియమాల పాటింపు, ఒత్తిడి లేని జీవన విధానం, విధులకు హాజరయ్యే ముందు తగిన విశ్రాంతి అవసరం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. డ్రైవర్లు మానసిక ప్రశాంతతతో విధులు నిర్వహిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, కుటుంబ సహకారం కూడా కీలకమని వక్తలు సూచించారు. రహదారిపై ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాజువాక డిపో మేనేజర్ శ్రీ పి. మల్లేశ్వరరావు, ఎంఎఫ్, ఏఎం(పి), డిపో ఎస్‌డీఐ తదితర అధికారులు పాల్గొని డ్రైవర్లకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

గాజువాక, (పున్నమి ప్రతినిధి):

జాతీయ రహదారి భద్రతా మాసము కార్యక్రమంలో భాగంగా గురువారం గాజువాక డిపోలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా యాక్సిడెంట్ మరియు డ్యామేజ్ డ్రైవర్లకు రహదారి భద్రత, ప్రమాద రహిత డ్రైవింగ్ విధానాలు, రహదారి నియమాల పాటింపు, ఒత్తిడి లేని జీవన విధానం, విధులకు హాజరయ్యే ముందు తగిన విశ్రాంతి అవసరం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. డ్రైవర్లు మానసిక ప్రశాంతతతో విధులు నిర్వహిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, కుటుంబ సహకారం కూడా కీలకమని వక్తలు సూచించారు. రహదారిపై ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాజువాక డిపో మేనేజర్ శ్రీ పి. మల్లేశ్వరరావు, ఎంఎఫ్, ఏఎం(పి), డిపో ఎస్‌డీఐ తదితర అధికారులు పాల్గొని డ్రైవర్లకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.