కామారెడ్డి,05 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :
రామారెడ్డి గ్రామాభివృద్ధిలో ముందుండే సర్పంచ్–ఉప సర్పంచ్ లకు గౌరవానికి నేడు రామారెడ్డి వేదికగా మారింది.గ్రామ పూసల సంఘం ఆధ్వర్యం లో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పూసల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి, శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజల సమస్యల పరిష్కారంలో సర్పంచ్, ఉప సర్పంచ్ చురుకైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలతో మమేకమై, ఎప్పుడూ అందుబాటులో ఉండటం వలన వారికి ఈగౌరవం లభించును అని అన్నారు. ఈ కార్యక్రమంలో పూసల సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నేతలకు శాలువాలు, పూలమా లలు వేసి సత్కరించారు. గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి మరింతగా కొనసాగిస్తామని ఈ సంద ర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ హామీ ఇచ్చారు


