Saturday, 4 April 2026
  • Home  
  • టేకులపల్లి మోడల్ స్కూల్‌లో దయనీయ స్థితి – ప్రమాదకరంగా మారిన హాస్టల్ భవనం, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ జాగృతి నేత శ్రీమతి కవిత
- ఖమ్మం

టేకులపల్లి మోడల్ స్కూల్‌లో దయనీయ స్థితి – ప్రమాదకరంగా మారిన హాస్టల్ భవనం, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ జాగృతి నేత శ్రీమతి కవిత

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతినిధి) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ స్కూల్‌లో దయనీయ స్థితి మీద తెలంగాణ జాగృతి నేత శ్రీమతి కవిత ఆందోళన వ్యక్తం చేశారు. టేకులపల్లి మోడల్ స్కూల్ ని సం దర్శించిన ఆమె మీడియా తో మాట్లాడుతూ.. మోడల్ స్కూల్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. హాస్టల్ భవనం పూర్తిగా ప్రమాదకర స్థితికి చేరడం వల్ల విద్యార్థులు భయాందోళన మధ్య రోజులు గడుపుతున్నారన్నారు. కొన్ని రోజుల క్రితం భోజనంలో బొద్దింకలు, పురుగులు రావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి రావడంతో నిర్వహణ లోపాలు బయటపడ్డాయని ప్రభుత్వ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఇలాంటి సమస్యలు నిరంతరం వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో పర్యటించినా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రజల తరుపున డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు.

పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి తెలంగాణ ప్రతినిధి)

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం
టేకులపల్లి మోడల్ స్కూల్‌లో దయనీయ స్థితి మీద తెలంగాణ జాగృతి నేత శ్రీమతి కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
టేకులపల్లి మోడల్ స్కూల్ ని సం దర్శించిన ఆమె మీడియా తో మాట్లాడుతూ..
మోడల్ స్కూల్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. హాస్టల్ భవనం పూర్తిగా ప్రమాదకర స్థితికి చేరడం వల్ల విద్యార్థులు భయాందోళన మధ్య రోజులు గడుపుతున్నారన్నారు. కొన్ని రోజుల క్రితం భోజనంలో బొద్దింకలు, పురుగులు రావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి రావడంతో నిర్వహణ లోపాలు బయటపడ్డాయని
ప్రభుత్వ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఇలాంటి సమస్యలు నిరంతరం వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో పర్యటించినా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు

సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రజల తరుపున డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.