Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుతో వ్యక్తి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆపద్భాంధవుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పిడుగుపాటుతో మస్తానయ్య మృతి – బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం వెంకటాచలం మండలం, అక్టోబర్ 17:శ్రీకాంత్ కాలనీలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
  • గురువారం తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
  • ఈ సమయంలో పిడుగు పడి గుడిసెలో నిద్రిస్తున్న ఆమ్మటి మస్తానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆపద్భాంధవుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు

పిడుగుపాటుతో మస్తానయ్య మృతి – బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

వెంకటాచలం మండలం, అక్టోబర్ 17:
శ్రీకాంత్ కాలనీలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడి గుడిసెలో నిద్రిస్తున్న ఆమ్మటి మస్తానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనలో ఇంట్లోని మొబైల్ ఫోన్ పగిలిపోగా, స్విచ్ బోర్డులు కాలిపోయాయి. చంటి బిడ్డ చెవికి స్వల్ప గాయం తగిలింది. ఉదయం సమాచారం అందుకున్న సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు.

ఆయన మట్టి ఖర్చుల నిమిత్తం పార్టీ తరపున రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ,
“ఈ విషాద ఘటనపై స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చాం. ప్రభుత్వం తక్షణ సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. పేదలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి, భవాని నాయుడు, పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *