Thursday, 12 February 2026
  • Home  
  • *స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమ్మర్లకు ప్రాతినిధ్యం కల్పించాలి*
- యాదాద్రి భువనగిరి

*స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమ్మర్లకు ప్రాతినిధ్యం కల్పించాలి*

పున్నమి,యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో 4 శాతం జనాభా కలిగి 20 లక్షల మంది ఉన్న కుమ్మర్లకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం గౌరవాధ్యక్షులు చేతరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్ లాడ్జిలో కుమ్మరి సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు చేతరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో చట్ట సభల్లో అడుగు పెట్టని కుమ్మర్లకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కుమ్మర్లకు సామాజిక న్యాయం కల్పించనట్లయితే అన్ని సీట్లలో కుమ్మర అభ్యర్థులను నిలబెట్టి గెలుపు ఓటములను తారుమారు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గంగధారి రాములు, అరూరి నర్సింహ్మ,బేతాళ బాల నర్సింహ్మ, మారుపాక వెంకటేశ్,నానంచర్ల నర్సింహ్మ, అన్నారం రమేష్,తీగుళ్ల యెహోవదాస్, ఎలగందుల బాలరాజు,ఎల్లయ్య,కుమార్, పాండు, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

పున్నమి,యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్రంలో 4 శాతం జనాభా కలిగి 20 లక్షల మంది ఉన్న కుమ్మర్లకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం గౌరవాధ్యక్షులు చేతరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్ లాడ్జిలో కుమ్మరి సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు చేతరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో చట్ట సభల్లో అడుగు పెట్టని కుమ్మర్లకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కుమ్మర్లకు సామాజిక న్యాయం కల్పించనట్లయితే అన్ని సీట్లలో కుమ్మర అభ్యర్థులను నిలబెట్టి గెలుపు ఓటములను తారుమారు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గంగధారి రాములు, అరూరి నర్సింహ్మ,బేతాళ బాల నర్సింహ్మ, మారుపాక వెంకటేశ్,నానంచర్ల నర్సింహ్మ, అన్నారం రమేష్,తీగుళ్ల యెహోవదాస్, ఎలగందుల బాలరాజు,ఎల్లయ్య,కుమార్, పాండు, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.