ప్రపంచం 5G, 6Gలు అంటూ ముందుకు దూసుకెళ్తుంటే… చిట్వేలి మాత్రం నెట్ సిగ్నల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అతి పెద్ద టవర్, కార్యాలయం ఉన్నా అక్కడ సిబ్బంది లేక బి.ఎస్.ఎన్.ఎల్ టవర్ మూగబోయింది. ప్రభుత్వ సంస్థే ఇంత నిర్లక్ష్యం చేస్తే, ప్రైవేటు సంస్థలపై ఏమని చెప్పాలి? ఇంటర్నెట్ లేక ప్రభుత్వ కార్యాలయాలు పనులు నిలిచిపోగా, అధికారులు తమ వ్యక్తిగత డేటాతోనే సేవలు అందిస్తున్నారు. బ్రాడ్‌బ్యాండ్ పనిచేయదు కానీ బిల్లు మాత్రం వస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలే కాదు, అధికారులకే ‘ఓటిపి’ రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రజల్లో బి.ఎస్.ఎన్.ఎల్ అంటే ఇప్పుడు “బిల్, సిగ్నల్ లేని సంస్థ” అనే వ్యంగ్యం వినిపిస్తోంది. మండల ప్రజలు ఒకటే కోరుతున్నారు – చిట్వేలి టవర్ మళ్లీ పనిచేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని.

టవర్ ఉంది : సిగ్నల్ లేదు. చిట్వేలిలో మూగబోయిన బి.ఎస్.ఎన్.ఎల్