Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం నగరంలోని పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖమ్మం నగరంలోని పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి.
  • దసరా సెలవుల సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
  • రోటరీ నగర్‌లో గల ఖమ్మం పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత ఆధ్వర్యంలో విద్యార్థినులు, విద్యార్థులు బతుకమ్మను అలంకరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఖమ్మం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. దసరా సెలవుల సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. రోటరీ నగర్‌లో గల ఖమ్మం పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత ఆధ్వర్యంలో విద్యార్థినులు, విద్యార్థులు బతుకమ్మను అలంకరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకున్నారు. అమ్మ వారి దివ్యాశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నారు. ఖమ్మం ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు పబ్లిక్ స్కూల్ తరపున తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సక్రమంగా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *