Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మంగారి గుడి ప్రాంగణంలో చెన్నకేశవులు – హర్షవర్ధని రెడ్డమ్మ పెళ్లి మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్ మండలం బ్రహ్మంగారి గుడి ప్రాంగణంలో, 17 ఆగష్టు ఆదివారం రోజున కందుల వారి వివాహ వేడుక వైభవంగా జరిగింది.
  • చిట్వేల్ మండలంలోని, కే కందులవారిపల్లి గ్రామానికి చెందిన.
  • చిట్వేల్ మాజీ మండల అధ్యక్షుడు కందుల గుండయ్య నాయుడు గారి కుమార్తె హర్షవర్ధని రెడ్డమ్మ కు చెన్నకేశవులు తో శుభముహూర్తంలో పెళ్లి జరిగింది.

చిట్వేల్ మండలం బ్రహ్మంగారి గుడి ప్రాంగణంలో, 17 ఆగష్టు ఆదివారం రోజున కందుల వారి వివాహ వేడుక వైభవంగా జరిగింది. చిట్వేల్ మండలంలోని, కే కందులవారిపల్లి గ్రామానికి చెందిన. చిట్వేల్ మాజీ మండల అధ్యక్షుడు కందుల గుండయ్య నాయుడు గారి కుమార్తె హర్షవర్ధని రెడ్డమ్మ కు చెన్నకేశవులు తో శుభముహూర్తంలో పెళ్లి జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వేదికను పూలతో, దీపాలతో అలంకరించగా కళ్యాణోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. వివాహ వేడుకలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. అనంతరం విందు భోజనంలో పాల్గొన్న అతిథులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొత్త దంపతులకు సుఖసంతోషాలతో నిండిన గృహస్థ జీవితం కలగాలని అందరూ ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *