Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కుండలేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్న బిజెపి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కుండలేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్న బిజెపి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 17 కాట్రేనికోన దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులతో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆలయ విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం చేసి శాలువ…

ఆగస్టు 17 కాట్రేనికోన

దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులతో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆలయ విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం చేసి శాలువ కప్పి సత్కారం చేశారు,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కోశాధికారి గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి సూచించారు,ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు,మోదీ దేశ రక్షణ,అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు.రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *