Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

పోలీస్ సింగ్ తో నేరాల నియంత్రణ క్షేత్రస్థాయిలో రాత్రి గస్తీ పై దృష్టి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి Daily న్యూస్ ప్రతినిధి: T.
  • రవీందర్ 👉 *విజబుల్ పోలిసింగ్ తో నేరాల నియంత్రణ....క్షేత్రస్థాయిలో రాత్రి గస్తీపై దృష్టి* 👉 *రైల్వే స్టేషన్, బస్టాండ్ లో విస్తృత తనిఖీలతో చట్ట వ్యతిరే కార్యాకాలాపాల కట్టడి* *నేర నియత్రణలో భాగంగా హోటల్స్, లాడ్జీలలో సోదాలు, అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరణ* *గంజాయి సరఫరా, వినియోగాన్ని…
  • విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు, దొంగతనాలు నియంత్రణలో వుంటాయన్న నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం రోజులుగా పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

పున్నమి Daily న్యూస్
ప్రతినిధి: T. రవీందర్

👉 *విజబుల్ పోలిసింగ్ తో నేరాల నియంత్రణ….క్షేత్రస్థాయిలో రాత్రి గస్తీపై దృష్టి*

👉 *రైల్వే స్టేషన్, బస్టాండ్ లో విస్తృత తనిఖీలతో చట్ట వ్యతిరే కార్యాకాలాపాల కట్టడి*

*నేర నియత్రణలో భాగంగా హోటల్స్, లాడ్జీలలో సోదాలు, అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరణ*

*గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు…*

*సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని సీసి కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజలు స్వచ్చద్దంగా ముందుకు రావాలని విజ్ఞప్తి*

*పోలీస్ కమిషనర్ సునీల్ దత్..*

నేరాల నియంత్రణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు, దొంగతనాలు నియంత్రణలో వుంటాయన్న నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం రోజులుగా పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీస్ గస్తీ పెంచి, పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సుమారు 50 హోటళ్ళు, లాడ్జీలపై పోలీసులు సోదాలు నిర్వహించి అనుమానిత వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించి, అనంతరం వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు. గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కట్టడిలో పురోగతి సాధించడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా గంజాయి , రేషన్ బియ్యం, ఇసుక వంటి అక్రమ రవాణా,పాత నేరస్తుల కదలికలను కట్టడి చేసేలా జిల్లా పోలీస్ యంత్రాంగం వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నారని తెలిపారు.

సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని సీసి కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజలు స్వచ్చద్దంగా ముందుకు రావాలని,వ్యాపారస్తులు ఖచ్చితంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *