Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

50 వేల ఫాలోవర్స్‌తో సరికొత్త మైలురాయి.. ఘనంగా క్రేజీ మానస, క్రేజీ దీపక్. సెలబ్రేషన్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
50 వేల ఫాలోవర్స్‌తో సరికొత్త మైలురాయి.. ఘనంగా క్రేజీ మానస, క్రేజీ దీపక్. సెలబ్రేషన్.

ఖానాపురం పున్నమి ప్రతినిధి:50 వేల ఫాలోవర్స్‌తో సరికొత్త మైలురాయి.. ఘనంగా క్రేజీ మానస. క్రేజీ దీపక్. సెలబ్రేషన్
బుధరావుపేటలో సంబరాలు.. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వేడుక
ఖానాపురం మండలం, బుధరావుపేట గ్రామానికి చెందిన గుండగాని మహేందర్ సోషల్ మీడియాలో 50 వేల మంది ఫాలోవర్స్‌ను సంపాదించిన సందర్భంగా ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామ యువకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని 50K ఫాలోవర్స్ మైలురాయిని చేరుకోవడం పట్ల మహేందర్ సంతోషం వ్యక్తం చేశారు. తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్క ఫాలోవర్‌కు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామ యువకులు పాల్గొని మహేందర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో ఈ వేడుక సందడిగా సాగింది.

50 వేల ఫాలోవర్స్‌తో సరికొత్త మైలురాయి.. ఘనంగా క్రేజీ మానస, క్రేజీ దీపక్. సెలబ్రేషన్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *