వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు వైద్య మరియు ఆరోగ్య శాఖలో 20 సంవత్సరాలు పైబడి ఆరోగ్య సేవలు అందిస్తూ ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత గారి దగ్గర నుండి రెగ్యులర్ నియామక ఆర్డర్స్ అందుకున్న హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులను, రాష్ట్ర నాయకులు సిహెచ్.
- ప్రభాకర్ రావు గార్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత గారి సమక్షంలో ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు మరియు జిల్లా నాయకత్వం ఘనంగా అభినందించారు.
- వైద్య ఆరోగ్య శాఖలో అనేక సంవత్సరాలు పాటు సేవలందించటంతో పాటు కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయక సేవలందించిన దరిమిలా వారి సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని రెగ్యులర్ చేసిన శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ మినిస్టర్…
నెల్లూరు వైద్య మరియు ఆరోగ్య శాఖలో 20 సంవత్సరాలు పైబడి ఆరోగ్య సేవలు అందిస్తూ ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత గారి దగ్గర నుండి రెగ్యులర్ నియామక ఆర్డర్స్ అందుకున్న హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులను, రాష్ట్ర నాయకులు సిహెచ్. ప్రభాకర్ రావు గార్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత గారి సమక్షంలో ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు మరియు జిల్లా నాయకత్వం ఘనంగా అభినందించారు. వైద్య ఆరోగ్య శాఖలో అనేక సంవత్సరాలు పాటు సేవలందించటంతో పాటు కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయక సేవలందించిన దరిమిలా వారి సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని రెగ్యులర్ చేసిన శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ యాదవ్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా చిన్న చిన్న కారణాలతో ఇంకా పెండింగ్లో ఉన్న అనేకమంది హెల్త్ అసిస్టెంట్లు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులను ఇతర పారామెడికల్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు విధానంలో ఉండి మరణించిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, విధి నిర్వహణలో ఉద్యోగం చేస్తున్న కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ మజార్, జిల్లా ఉపాధ్యక్షులు మురళి కృష్ణ, సిటీ అధ్యక్షులు గౌస్ బాషా సిటీ ఉపాధ్యక్షులు ఉదయ్ కిరణ్, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కె.వి కిరణ్ కుమార్, బెల్లంకొండ ప్రసాద్, గంగు నాయుడు, మురళి, ప్రభాకర్ రావు, శ్రీనివాసులు, స్టీఫెన్ కుమార్, శివరామకృష్ణ, రవిచంద్ర, షెహజ్మా తదితరులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్