Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఘన నివాళి లక్ష్మీనరసాపురంలో విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఘన నివాళి లక్ష్మీనరసాపురంలో విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

వార్త ముఖ్యాంశాలు

  • అనపర్తి, జూలై 5 ( పున్నమి ప్రతినిధి ): విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శనివారం అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
  • అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరంలో అల్లూరి సీతారామరాజు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, త్యాగనిరతి, దేశభక్తి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అనపర్తి, జూలై 5 ( పున్నమి ప్రతినిధి ): విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శనివారం అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరంలో అల్లూరి సీతారామరాజు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, త్యాగనిరతి, దేశభక్తి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, లక్ష్మీనరసాపురం గ్రామ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *