Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జగిత్యాల

బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం – ఏకగ్రీవ ఎన్నిక మండల అధ్యక్షుడిగా ఏలేశ్వరం గౌరీ శంకర్

బుగ్గారం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం
– ఏకగ్రీవ ఎన్నిక

మండల అధ్యక్షుడిగా ఏలేశ్వరం గౌరీ శంకర్
బుగ్గారం, అక్టోబర్ 2:. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ ముత్యాల నల్ల పోచమ్మ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో బుగ్గారం మండల ప్రెస్ క్లబ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఐ జె యూ అనుబంధ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్షులుగా మొగిలిసుదన్ .(ఆంధ్రజ్యోతి), మండల అధ్యక్షులుగా ఏలేశ్వరం గౌరీ శంకర్ (బతుకమ్మ), ప్రధాన కార్యదర్శిగా నక్క చంద్రమౌళి (మనం), ఉపాధ్యక్షులుగా కట్ట రాజేందర్ (సాక్షి డిజిటల్), కండ్లె తిరుపతి (తెలంగాణ శక్తి) సహాయ కార్యదర్శులుగా ముత్యాల సురేష్ (వే టు న్యూస్), కోసరి శ్రీనివాస్ (తెలంగాణ గళం), ప్రచార కార్యదర్శిగా ఎండి అబ్దుల్ రెహమాన్ (తెలంగాణ శక్తి ), కోశాధికారిగా బుక ప్రవీణ్ కుమార్ (ప్రజా జ్యోతి),
సలహాదారులుగా సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి, వోజ్జల రమేష్ (సాక్షి), ఆర్తి శ్రీకాంత్ (ఈనాడు) చినుముల రాజేందర్ (నమస్తే తెలంగాణ) కార్యవర్గ సభ్యులుగా కల్లెం నాగేష్ (వార్త), పల్లెర్ల భూమయ్య (నవశక్తి) పల్లెర్ల వంశీ(ప్రజా దర్బార్), చుక్క విశాల్ (ప్రజా మంటలు) ఎన్నుకున్నారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతతో ముందుకు సాగుతూ వృత్తి గౌరవాన్ని కాపాడాలని అన్నారు. మండలంలోని ప్రజా సమస్యలను గుర్తించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు అధికారులకు వారధి గా ఉంటూ ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని బాధ్యతాయుతంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, సభ్యుల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేసి, సభ్యులందరి సహకారంతో ఐక్యతగా ముందుకు సాగుతామని తెలిపారు.
అలాగే మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాత్రికేయులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని నూతన కార్యవర్గ సభ్యులు అన్నారు.
నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు జర్నలిస్టులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం మండలానికి చెందిన జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *