నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
രചയിതൃ പാനൽ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బండగానిపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఉదయగిరి మండలం బండగానిపల్లి స్వర్ణ గ్రామ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ ఆశయాలు, దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్య సాధన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, అహింస, సత్యం వంటి విలువలను ప్రజలు ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో పీడీఓ ఆంజనేయులు, స్వర్ణ గ్రామ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింసా మార్గాలను నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని వారు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *