ఉమ్మడి కర్నూలు జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు జీవో నెంబర్ 103 ని రద్దుచేయాలని కోరుతూ మంగళవారం మంత్రి ఫరూక్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మే నెల 14 వ తేదిన జీవో నెంబర్ 54 ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఈ జీవో ప్రకారం డిఎస్పి స్థాయి పదోన్నతులు,రాష్ట్రస్థాయి పరిధిలో సీఐ పదోన్నతులు జోనల్ పరిధిలో ఉండే విధంగా పేర్కొంటూ జీవో విడుదల చేసిందని,గతంలో పోలీసు పదోన్నతులు మరియు బదిలీలు జోన్లవారీగా నాలుగు విభాగాలుగా చేపట్టేవారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 15 జులై 2026 తేదిన జీవో నెంబర్ 103 ను విడుదల చేసిందని,జీవో నెంబర్ 103 ప్రకారం ఉమ్మడి రాయలసీమ జిల్లాలు మరియు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పనిచేసే సీఐలకు ఎస్ఐలకు తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని,103 జీవో ప్రకారం నాలుగు జోన్లను రద్దుచేసి రాష్ట్రస్థాయిలో మల్టీ లెవెల్ జోన్ 1,మల్టీ లెవెల్ జోన్ 2 గా విభజించారని, దీనివలన ఉమ్మడి రాయలసీమ జిల్లాలైన కడప,కర్నూలు,చిత్తూరు, అనంతపురం అలాగే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో పనిచేసే ఎస్సైలు,సిఐలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని,జీవో నెంబర్ 103 ని రద్దుచేసి పాత విధానమే ఉండాలని కోరుతూ మంత్రి ఫరూక్ కు పోలీసు అధికారులు వినతిపత్రం అందజేశారు.జీవో నెంబర్ 103 ప్రకారం ఒకే తేదిన ఎస్సైలుగా ఒకరు మల్టీ లెవెల్ జోన్ 1,మరొకరు మల్టీ లెవెల్ జోన్ 2 లో పదవి బాధ్యతలు చేపడితే మల్టీ లెవెల్ జోన్ 1 లో ఉన్న ఎస్ఐకి త్వరగా పదోన్నతి పొందుతారని,మల్టీ లెవెల్ జోన్ 2 లో ఉన్న ఎస్ఐ కి పదోన్నతులు పొందలేరని,మల్టీ లెవెల్ జోన్ 1 లో ఉన్న ఎస్ఐ,సీఐ గా డీఎస్పీగా పదోన్నతి పొందితే మల్టీ లెవెల్ జోన్ 2 లో ఉన్న ఎస్ఐ,సీఐ దగ్గర ఆగిపోయే అవకాశం ఉందని, కనుక జీవో నెంబర్ 103 ని రద్దుచేసి పాత జీవో ప్రకారమే తమకు న్యాయం చేయాలని న్యాయ శాఖ మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకొని వచ్చి ఉమ్మడి కర్నూలు జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు వినతిపత్రం అందజేశారు.

జీవో నెంబర్ 103 ని రద్దుచేయాలని కోరుతూ మంత్రి ఫరూక్ కు వినతిపత్రం అందజేసిన… ఉమ్మడి కర్నూలు జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు.