Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

కలెక్టరేట్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

అక్టోబర్ 2 నిర్మల్ పున్నమి ప్రతినిధి
కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. యావత్తు దేశాన్ని స్వాతంత్ర్య సంగ్రామంలో సంఘటితం చేసి ముందుండి శాంతి, అహింస మార్గాలలో నడిపించారని అన్నారు. గాంధీజీ జీవితాన్ని అందరం స్పూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. తన జీవితాన్ని మొత్తం భారతదేశ స్వాతంత్ర్యం కొరకు అర్పించారని కలెక్టర్ గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. ప్రతి ఒక్కరు గాంధీజీ చూపిన మార్గంలో పయనించాలని చెప్పారు. సమాజంలోని రుగ్మతల నిర్మూలనలో, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని కలెక్టర్ తెలిపారు.

ఈ జయంతి వేడుకలలో భాగంగా జిల్లా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ రాథోడ్ రమేష్ మాట్లాడుతూ, భారత స్వాతంత్రం కొరకు శాంతి, అహింసా, సత్యం మార్గాలలో నడుస్తూ, గాంధీజీ తన జీవితాన్ని త్యాగం చేశారని వివరించారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, దేశ అభివృద్ధిలో తమ వంతు సహకారం అందించాలని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు మాట్లాడుతూ, గాంధీజీ గొప్పతనాన్ని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పాత్రను వివరించారు.
ఈ జయంతి వేడుకలలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *