సూళ్లూరుపేట:- గాంధీ జయంతి సందర్భంగా సూళ్లూరుపేట పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి మార్గాలు యావత్ ప్రపంచానికి ఆదర్శమని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తీసుకురావడమే లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజాసంక్షేమం, గ్రామాభివృద్ధి, స్వావలంబన, పరిశుభ్రత, సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.